BREAKING
మాస్కోలోని డచ్ రాయబార కార్యాలయం సమీపంలో భారీ కుడ్యచిత్రం ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది..

గజపతినగరం మండలంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కొండపల్లి విస్తృత పర్యటన

Select Suryaa Now
గజపతినగరం మండలంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కొండపల్లి విస్తృత పర్యటన

గజపతినగరం ,నవంబర్ 26 (మేజర్ న్యూస్) 

 గజపతినగరం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. గజపతినగరం మేజర్ పంచాయతీతో పాటు వేమలి, సాలిపేట, పిడిశిల, కాలంరాజుపేట గ్రామాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా పర్యటించారు గజపతినగరం పంచాయతీ కూటమి అభ్యర్థి కర్రి శ్రీదేవికి మద్దతుగా ఆర్యవైశ్య సంఘం నేతలతో సమావేశమయ్యారు. రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. నియోజకవర్గంలో తక్కువ సమయంలో 100 పడకల ఆసుపత్రి పూర్తి చేశామని, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి వేశామని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈబీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నామన్నారు. వేమలి సర్పంచ్ అభ్యర్థి కోరాడ మోహనరావుకు మద్దతుగా పర్యటించారు. రామాలయ నిర్మాణానికి ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా వంతు సహాయం చేస్తానని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.సాలిపేట సర్పంచ్ అభ్యర్థి మిడతాన మహేష్‌కు మద్దతు తెలిపారు. ఇంటింటికీ తాగునీరు, మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. యువ నాయకత్వానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పిలుపు నిచ్చారు.పిడిశీల సర్పంచ్ అభ్యర్థి యడ్ల పైడిపినాయుడుకు మద్దతుగా పర్యటించారు. చెరువుల వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితమవుతోందని, ఆ చెరువుల పర్మిషన్లు రద్దు చేయించామన్నారు. తాగునీటి సమస్యకు త్వరలో ఆర్.ఓ ప్లాంట్ నిర్మిస్తామని గ్రామ అభివృద్ధికి మేము గ్రామ అభివృద్ధికి మా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కాలంరాజుపేట కూటమి బలపరిచిన అభ్యర్థిని శీర అప్పలనాయుడు బార్య లక్మి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ప్రతి గ్రామంలో కూటమి అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాల్ రాజు, మండల నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.