ఎస్పీడబ్ల్యూ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీపద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 650 మంది విద్యార్థులకునాంది ఫౌండేషన్ ద్వారా ఆరు రోజులు పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ పొందారు. శనివారం ముగింపు కార్యక్రమానికిముఖ్య అతిథిగా కర్నూల్ రీజియన్ రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు, విశిష్ట అతిథిగా ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.భీమన్న హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడంలో కీలకమని తెలిపారు. ఎం ఎన్ సి కంపెనీల్లో రాణించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అన్నారు. నాంది ఫౌండేషన్ వారికి, కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొమెంటోలు, సర్టిఫికెట్లు, మిగిలిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం, కళాశాల హెచ్ ఓ డి లు, ఫ్యాకల్టీ, నాంది ఫౌండేషన్ ట్రైనర్లు హరి కుమార్, ప్రత్యూష, జీవన్ కుమార్, జయప్రకాష్, వేణుగోపాల్, సాయి గణేష్, శరత్ బాబు, అయేషా, హిమ, దీప, ట్రైనర్ దేవకి సాయి లీల పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి