ఏపీయుడబ్ల్యుజే హైపర్ కమిటీ సభ్యుడుగా చొక్కాపు
రామభద్రపురం, సెప్టెంబర్: 30.మేజర్
న్యూస్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు జిల్లా హైపర్ కమిటీ సభ్యుడుగా రామభద్రపురం సూర్య దిన పత్రిక విలేఖరి చొక్కాపు రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు విజయనగరంలో ఆదివారం ఏపీయ ఎడబ్ల్యుజే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ యూనియన్కు అనుబంధంగా ఉండేందుకు ఒక హైపర్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చిన్న పత్రికల తరపున రామభద్రపురంనకు చెందిన చొక్కాపు.రామకృ ష్ణను నియమించారు. ఈ సందర్భంగా చొక్కాపు రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఏపీయుడబ్ల్యుజే బలోపేతానికి తన శక్తి వం చన లేకుండా కృషి చేస్తానని, అలాగే విలేఖర్ల సమస్యల పరిష్కారానికి యూనియన్ సహకారంతో కృషి చేస్తానని అన్నారు. ఈయ ఎన ఎంపిక పట్ల ఏపీయుడబ్ల్యుజే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల వెంకటరావు, మండల విలేఖర్లు అభినందనలు, హర్షం వ్యక్తం చేశారు.