BREAKING
భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం పేదవాడి ఆత్మగౌరవానికి ‘పట్టా’భిషేకం! స్థానిక సమరానికి వైకాపా సమరశంఖం : మళ్ళా విజయప్రసాద్ దిశానిర్దేశం 48వ వార్డులో 800 మంది పేద కుటుంబాలకు పేదలకు పట్టాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే పద్మనాభం ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ ఎమ్ సి ) ఎన్నికలు తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు భారత సీనియర్ రెజ్లింగ్ జట్లకు డాక్టర్‌గా గుంటూరు వైద్యుడు పవన్ కుమార్ ఖండే నియామకం! డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.10 కోట్ల మోసం గ్లోబల్ ఎనర్జీ దిగ్గజం బీపీ కీలక నిర్ణయం అన్ని ఆర్థిక నిబంధనల ఉల్లంఘన కేసుల్లో దోషిగా తేలిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్!

ఎన్‌టీపీసీ సింహాద్రిలో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
ఎన్‌టీపీసీ సింహాద్రిలో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

 

పరవాడ, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్: 
ఎన్‌టీపీసీ సింహాద్రి ప్రాంగణంలో  సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బందికి సైబర్ క్రైమ్ మరియు సైబర్ మోసాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ టీమ్ అధికారులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు,  ఓటిపిమోసాలు, ఫేక్  కేవైసీ కాల్స్, బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టులు తదితర సైబర్ నేరాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బందికి వివరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, ఓటిపి, పిన్,పాస్‌వర్డ్‌లు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సైబర్ క్రైమ్ & ఐటీ కోర్ ఎస్సై సురేష్ కుమార్, సిబ్బంది మూర్తి, శ్రీధర్, సీఐఎస్ఎఫ్ కమాండెంట్, పరవాడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని, అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు సమాచారం అందించాలని తెలిపారు.కార్యక్రమం అనంతరం సీఐఎస్ఎఫ్ కమాండెంట్  సైబర్ క్రైమ్ టీమ్ సభ్యులను మరియు పరవాడ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కరరావును జ్ఞాపికలతో సత్కరించారు.