BREAKING
అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ ఇంటింటా ప్రచారం ఆలమూరు మండలంలో జోరుగా ఎన్నికల సందడి: రెండో రోజు 48 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు! ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్ల మాయలో పడిపోతున్నామా.. కొనుగోలుకు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ. ముక్కామల కూటమి ఎంపీటీసీ నామినేషన్లకు భారీ ర్యాలీ పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ దివంగత నటి సౌందర్యతో అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్ ప్రేమ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు

ఎన్నికల్లో అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరిక

Select Suryaa Now
ఎన్నికల్లో అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు  జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరిక

ఓర్వకల్లు మేజర్ న్యూస్:;స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో అలజడులు, అల్లర్లు సృష్టించినా, ఘర్షణలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.

బుధవారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో పాటు కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, రూరల్ సీఐ చంద్రబాబు నాయుడును ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు సూచించారు. అల్లర్లు సృష్టించే వారిపై, ఘర్షణలకు దిగే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు ఎస్సై సునీల్ కుమార్, ఉలిందకొండ ఎస్సై, నాగలాపురం ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.