BREAKING
రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు ఎంపీటీసీ గా నామినేషన్ పత్రాలు అందజేసిన టిడిపి మహిళా నాయకురాలు గంగిరెడ్ల మేఘాల దేవి ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు ఏసియన్ పారా గేమ్స్ 4వ రోజు భారత్ హవా.. స్వర్ణ పతకాలతో అదరగొట్టిన అర్చర్లు షీతల్ దేవి, తోమన్ కుమార్ రేపే ప్రభాస్ పుట్టినరోజు.. టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు. -- అక్రమ మద్యం, నగదు రవాణాపై నిఘా.. ఎస్సై క్రాంతి కుమార్ భార్య చైర్ పర్సన్ గా ,భర్త కౌన్సిలర్ గా పోటీ

ఎన్నికల పనుల్లో జాప్యం వద్దు

Select Suryaa Now
ఎన్నికల పనుల్లో జాప్యం వద్దు

గాజువాక, సూర్య : మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో యంత్రాంగం క్షేత్రస్థాయి ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా గాజువాక జోన్‌ పరిధిలోని బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌ ప్రాంగణం, స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్‌ కె. రమేష్‌, సంబంధిత అధికారులతో కలిసి అక్కడి ఏర్పాట్ల పురోగతిపై సెక్టార్‌ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కొన్ని చోట్ల పనులు ఇంకా ఆశించిన స్థాయిలో లేకపోవడంపై స్పందిస్తూ, పెండింగ్‌ పనులను తక్షణమే పూర్తి చేసి కేంద్రాలను పటిష్ఠంగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

అనంతరం పోలింగ్‌ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ, నిబంధనలు, తమ విధులు, బాధ్యతలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సామగ్రి పంపిణీ సమయం నుంచి పోలింగ్‌ ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పక్కాగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని ఆదేశించారు. ఈ పర్యటనలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జ్ఞానవేణి, పర్యవేక్షక ఇంజినీర్లు సంపత్‌ కుమార్‌, రాయల్‌ బాబు, పద్మావతి, ఏసీపీ తిరుపతిరావు, జోనల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.