ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
ఎల్.కోట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన టౌన్ ఇన్‌చార్జి డీఎస్పీ రాఘవులు
లక్క వరపు కోట , సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్: రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని విజయనగరం పట్టణ టౌన్ ఇన్‌చార్జి డీఎస్పీ బి. రాఘవులు సూచించారు. సోమవారం ఎల్.కోట పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎల్.కోట ఎస్‌ఐ జె. రామకృష్ణతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం డీఎస్పీ రాఘవులు సోమవారం ఎస్ కోట రూరల్ సర్కిల్ పరిధిలోని వల్లంపూడి, జామి పోలీస్‌స్టేషన్లతో పాటు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేసి, అక్కడి రికార్డులు మరియు సిబ్బంది పనితీరును పరిశీలించి నట్లు విలేకరుల కు తెలిపారు ఈ కార్యక్రమం లో ఎస్ కోట రూరల్ సి ఐ హిమ గిరి సిబ్బంది పాల్గొన్నారు .