ఎంపిటిసి స్థానాలకు 40 నామినేషన్లు.. రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ ప్రక్రియ...
బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్: ఎంపీటీసీలకు 40 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన పార్టీ అభ్యర్థిగా బుట్టాయిగూడెం 1 ఎంపీటీసీ స్థానానికి మీడియం సునీత నామినేషన్ దాఖలు చేశారు. మండలంలో జనసేన 9, తెలుగుదేశం 11, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 17, సిపిఎం 2, కాంగ్రెస్ 1 చొప్పున ఆయా ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు వేశారు. రాత్రి 9 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కూటమి అభ్యర్థులుగా జడ్పిటిసి అభ్యర్థిగా మెట్ట బుచ్చిరాజు ఎంపీపీ అభ్యర్థిగా కొమరం మల్లేశ్వరరావులను ఎంపిక చేసినట్లు తెలిసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా కోర్స బాలకృష్ణను ఎంపిక చేశారు.