BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి

Select Suryaa Now
ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు.  రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి

ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు.

రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు: కల్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు.

రొంపిచెర్ల, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో రొంపిచెర్ల మండలంలో పోలీసు ఆంక్షలు అమల్లో ఉన్నాయని కల్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. ప్రసాదరావు తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నందున ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. రొంపిచెర్ల పురవీధులలో పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియకు మూడంచెల నిఘా ఉంటుందన్నారు. సీసీ కెమెరాల, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే 

మండలంలో 30 పోలీస్ యాక్ట్‌తో పాటు సెక్షన్ 144 సీఆర్‌పీసీ / 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమల్లో ఉన్నందున, ఎక్కడా నలుగురికి మించి గుమిగూడరాదని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి గుమిగూడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల ఎస్‌ఐ మధుసూదన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.