BREAKING
రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ... దళితులకు పదవులు కేటాయించే వరకు ఉద్యమిస్తాం -దళిత సంఘాల హెచ్చరిక పాతపట్నం ‘ఉమా సినీ మ్యాక్స్’ పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దాడులు. ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్ల చేరికకు రంగం సిద్ధం.. రేసులో పుణె, వడోదర ముందంజలో! సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించడం హర్షణీయం శివ శంకర కాలనీ, టీచర్స్ కాలనీలో టీడీపీ ఎన్నికల ప్రచారం. షిఫ్ట్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి భారత్ - న్యూజిలాండ్ నాలుగో వన్డే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కీలక మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా! యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ప్రోత్సాహం గ్రీన్‌ఫీల్డ్ వేదికగా అట్టహాసంగా 'ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్' టోర్నీ.. ఉత్కంఠభరితంగా ప్రారంభమైన పోటీలు! పంజాబ్ కింగ్స్‌లోకి మారిన తర్వాత హార్దిక్ పాండ్యా తొలి రియాక్షన్.. శ్రేయస్, పాంటింగ్‌లకు మద్దతుగా సంచలన పోస్ట్! కివీస్ గడ్డపై గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగిన టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడింగ్ వేళ డబుల్ ధమాకా! అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా.. సనత్ జయసూర్య సరసన చోటు! యశస్వి జైస్వాల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ డిమాండ్లు! యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం

ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన వైసిపి నేతలు

Select Suryaa Now
ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన వైసిపి నేతలు

నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం  స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాభిమానంతో ఘన విజయం సాధించిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందనలు తెలియజేశారు. విజయం సాధించిన అభ్యర్థులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజేతలను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. మండపేట రూరల్ పరిధిలోని పాలతోడు గ్రామం నుంచి చంద్రమల్ల శ్రీనివాస్ 62 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గ్రామ వైసీపీ అధ్యక్షుడు పిల్లా అరవరాజు, పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన ఎమ్మెల్సీ తోటను కలిశారు. అదేవిధంగా వెలగతోడు నుంచి నిచ్చెనకోళ్ల రమణ 22 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, ఈదల వీరాస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. జెడ్. మేడపాడు నుంచి కె ఆదిలక్ష్మి 69 ఓట్ల ఆధిక్యంతో, పసలపూడి-1 నుంచి కొల్లి హనుమాన్ ప్రసాద్ 371 ఓట్ల భారీ మెజారిటీతో, పసలపూడి-2 నుంచి చింతా రామ్మోహన్ రెడ్డి 503 ఓట్ల ఘన మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా పదవులు అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతతో కూడుకున్నవని గుర్తుంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని హితవు పలికారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని విజేతలకు సూచించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, నాయకులు దేవు శ్రీనివాస్ నాయుడు, వాసిరెడ్డి అర్జున్, అడబాల బాబ్జి, పోతంశెట్టి సత్యనారాయణ రెడ్డి, తోరం శ్రీనివాస్, గెడ్డం గాంధీబాబు తదితరులు పాల్గొన్నారు.