BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఎమ్మెల్యే ఏలూరి చొరవతో బాధితుడికి సీఎంఆర్ఎఫ్‌ నుంచి రూ.45 వేల సాయం

Select Suryaa Now
ఎమ్మెల్యే ఏలూరి చొరవతో బాధితుడికి సీఎంఆర్ఎఫ్‌ నుంచి రూ.45 వేల సాయం

పర్చూరు, మేజర్‌న్యూస్‌ : 
రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమైన నిరుపేదకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అండగా నిలిచారు. ఆయన చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి బాధితుడికి రూ.45 వేల విలువైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) మంజూరైంది.  పర్చూరు మండలం దేవరపల్లి  గ్రామానికి చెందిన పాలతోటి వెంకటేశ్వర్లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలు ఫ్రాక్చర్‌ కావడంతో మంచానికే పరిమితమయ్యారు. మధ్యతరగతి కుటుంబానికి చెంది వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబానికి వైద్య ఖర్చులు భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబం తమ సమస్యను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది.  బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టారు. ఆయన సిఫార్సుతో సీఎంఆర్ఎఫ్‌ నుంచి రూ.45 వేల ఎల్‌ఓసీ మంజూరైంది.  గుంటూరు కొత్తపేటలోని నుహా ఆసుపత్రిలో బాధితుడికి అవసరమైన వైద్యం అందించాలని ఆసుపత్రి డైరెక్టర్‌ను కోరారు. ఆపద సమయంలో తమ సమస్యను గుర్తించి వైద్య సాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నేతలు బాధితుడి కుటుంబానికి అందజేశారు.