BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

ఎమ్మెల్యే చొరవతో భూ సమస్య పరిష్కారం" డాక్టర్ సుంకరి"

Select Suryaa Now
ఎమ్మెల్యే చొరవతో భూ సమస్య పరిష్కారం" డాక్టర్ సుంకరి"

 

గుర్ల, సెప్టెంబర్28మేజర్ న్యూస్:పాలవలస గ్రామంలో   గత కొన్ని సంవత్సరాలుగా భూ సమస్యలతో సుమారు 50 మంది రైతుల యొక్క భూ సమస్య పరిష్కారంలో చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు గారి ఆదేశాలతో వినతి పత్రాన్ని అందించిన అనతికాలంలో సర్వే అధికారులు భూమిని సర్వే చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు  డాక్టర్ సుంకరి రమణమూర్తి తెలిపారు.
సోమవారం సర్వే డిపార్ట్మెంట్ అధికారులు 50 కుటుంబాలు కు సంబంధించిన భూసంబంధిత రైతులు పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో సర్వే  చేశారు.ఈ సందర్భంగా సంబంధిత రైతులు సర్వే అధికారులకు తమ భూములను చూపించి సమస్యను మొత్తం వివరించారు.ఈ సందర్భంగా సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ, రైతు సంక్షేమం అభివృద్ధి  కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గత 21 సంవత్సరాలుగా ఈ గ్రామమే  కాకుండా రాష్ట్రంలో ఉన్న అనేక గ్రామాలలో భూ సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపుతోందని తెలియజేసారు,15 రోజుల క్రితమే ఎమ్మెల్యే కళా వెంకటరావు గారి దృష్టికి ఈ సమస్య తీసుకు వెళ్లడం జరిగిందన్నారు, రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని పేర్కన్నారు, పాలవలస రైతులకు పూర్తిస్థాయి న్యాయం చేసి వారు సాగు చేస్తున్న భూమిలో వారికి సంపూర్ణ హక్కులు వచ్చేటట్టు కూటమి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు చందక సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సుంకరి పైడినాయుడు, మాజీ సర్పంచ్ పొట్నూరు అచ్చం నాయుడు, గేదెల అప్పలనాయుడు వల్లూరు భాస్కరరావు, సుంకరి ఉపేంద్ర, ఇజ్జిరోతు యల్లారావు, రైతు సోదరుల ప్రతినిధి పొట్నూరు పాపినాయుడు ,
రైతు సోదరులు సంచాన బంగారు నాయుడు, సంచాన రమేష్, మంత్రి సుందరరావు, గేదెల సత్యనారాయణ, సంచాన అప్పలనాయుడు, నీటి సంఘం సభ్యులు వల్లూరు పైడితల్లినాయుడు, తెలుగు యువత ప్రతినిధులు తాడ్డి నారాయణరావు, వల్లూరు చిన్నం నాయుడు, తాడ్డి అప్పలనాయుడు, సర్వే అధికారులు ప్రకాష్  తదితరులు పాల్గొన్నారు.