ఎంఎల్ఏ చేతులు మీదుగా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ
రేగిడి, సూర్య: మండలం ఆమదాలవలస గ్రామ రైతులకు రాజాం పార్టీ కార్యాలయంలో ఎంఎల్ఏ కోండ్రు మురళీ మోహన్ చేతులు మీదుగా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ గత ప్రభుత్వం నాయకులు తమ ఫొటోలతో పాసుపుస్తకాలు ఇస్తే కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్ర తో పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ దూబ ధర్మారావు, మండల టిడిపి అధ్యక్షులు కిమిడి అశోక్ కుమార్, గేదెల బాలమురళి, శాసపు గోవింద నాయుడు,బెవర రాంబాబు,రాజాం,వంగర, సంతకవిటి మండలాల నాయకులు , తహశీల్దార్ బి ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.