BREAKING
వెలుగొండ సందర్శనకు వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు..! మార్కాపురం గ్రామీణ ఎస్సై వేమన సూచన... రేపటి నుండి బ్రహ్మండ నాయకుని బ్రహ్మోత్సవాలు విజయవాడ సెంట్రల్‌లో కూటమి విజయమే లక్ష్యం కొత్త లగ్జరీ కారు కొన్న 'ప్రేమలు' హీరో నస్లెన్.. ధర ఎన్ని కోట్లు అంటే! ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్ష నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు! 132/33 kv నూతన sub- స్టేషన్ ప్రారంభం గురవరాజుపల్లి మినీ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం... ఆరోగ్య భీమా కార్డుల పంపిణీ హైడ్రా-తో నగర చెరువులన్నీ సుందరవనాలు: భాగ్యనగరానికి సరికొత్త జల వైభవం కాశి కాలభైరవ స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే? వైఎస్సార్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగింపు పండగలు లేదా వరుస సెలవులు వస్తే హైదరాబాద్ రోడ్లన్నీ పూర్తిగా ఖాళీ

ఈనెల 12న నగరంలో మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
ఈనెల 12న నగరంలో మెగా వైద్య శిబిరం

నగరం, మేజర్ న్యూస్:  సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 12న ఉదయం 9 గంటలకు మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ మధిర రత్నకుమారి తెలిపారు. శనివారం స్థానిక పిహెచ్ సిలో ఆమె మాట్లాడుతూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారన్నారు. బాపట్ల, చీరాల ఏరియా వైద్యశాలల నుంచి ఆయా వైద్య రంగాల్లోని నిపుణులు వైద్య పరీక్షలు చేస్తారన్నారు. చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, ఆర్థోపెడీషియన్, గైనకాలజిస్ట్, చిన్నపిల్లలు, దంత, కంటి తదితర వైద్యనిపుణులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు సరఫరా చేస్తారన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రత్న కుమారి కోరారు.