ఎద్దుల కొండ్రాయునికి వెండి ఒడ్డాణం
ఎద్దుల కొండ్రాయునికి వెండి ఒడ్డాణం
- భక్తుల దాతృత్వం మరువలేనివి
వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక పాపాగ్నినది ఒడ్డున వెలసిన శ్రీలక్ష్మి వృషభాచలేశ్వర స్వామి ఎద్దుల కొండ్రాయునికి భక్తుడు వెండి ఒడ్డాణం బహుకరణ చేసినట్లు ఆలయ ఇఓ కడప సుభాష్ వెల్లడించారు. శనివారం ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన భక్తుడు ఎలిగండ్ల బాలయ్య సతిమణి సుశీల రూ.లక్ష 2వేలు విలువ గల 443 గ్రాముల వెండి ఒడ్డాణాన్ని స్వామికీ సమర్పించారు. కుటుంబ సభ్యులు ప్రదీప్ కుమార్, సతిమణి జయవాణి, మనవళ్లు భరత్, దేవాన్ష్ లతో కలిసి అర్చకుడు హరిప్రవీణ్, పాలక మండలి చైర్మన్ పివి రమణ లకు అందజేశారు. అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ఇఓ, ఛైర్మన్ మాట్లాడుతూ దాతల దాతృత్వం మరువలేనివని, ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.