BREAKING
ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన!

దుర్గా దేవి గా జ్వాలాముఖి అమ్మవారు

Select Suryaa Now
దుర్గా దేవి గా జ్వాలాముఖి అమ్మవారు

ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని ఉత్తర బలిజ వీధిలో వెలసి అన్న శ్రీశ్రీశ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో గత ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు పి. శివకుమార్, రావిప్రోలు రామకృష్ణ శర్మ,సుబ్రహ్మణ్య కిషోర్ శర్మల ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుండి మంగళ వాయిద్యాలు, ద్వారా బంధురం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన,అమ్మవారికి మంగళ స్నానం,అభిషేకం, శ్రీదేవి ఖడ్గ పూజ విశేష పూజలు, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఎనిమిదవ రోజైన ఆదివారం   జ్వాలాముఖి అమ్మవారిని దుర్గాదేవి అలంకారంతో  పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమృతం శ్రీనివాసులు -లక్ష్మి దంపతులు, అమృతం ప్రసాద్ -స్వాతి దంపతుల కుమారుడు గిరీష్, నలిశెట్టి శ్రీనివాసులు -సునంద దంపతుల కుమారుడు బాలాజీ ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు అధికంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.