BREAKING
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు

డ్రైనేజీ తాగునీటికి శాశ్వత పరిష్కారం -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్

Select Suryaa Now
డ్రైనేజీ తాగునీటికి శాశ్వత పరిష్కారం  -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని, నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, గతంలో డ్రైనేజీ త్రాగునీటి సమస్యను వచ్చే ఆరు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని 53వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా 53వ డివిజన్‌లోని శివజ్యోతి నగర్‌లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ ఆదివారం ఇంటింటికి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ స్థానిక ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శంకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపిస్తే ఆరు నెలల వ్యవధిలోనే డివిజన్‌లో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా స్థానిక శివ జ్యోతి నగర్ లో బోరు నీటి సమస్యను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి సొంత నిధులతో మరమ్మత్తులు చేయించి గంట వివిధలో సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలియజేశారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ శంకర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో డివిజన్ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించిన ఆయన, రానున్న రోజుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ 53వ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని శంకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్