BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

*డి-లిమిటేషన్ ప్రచురణ కాపీ విడుదల..* *35 నుండి 44 వార్డులకు విస్తరణ..* *ప్రచురణ ఫారం-1 కాపీని విడుదల చేసిన కమిషనర్ కిరణ్ కుమార్..*

Select Suryaa Now
*డి-లిమిటేషన్ ప్రచురణ కాపీ విడుదల..*  *35 నుండి 44 వార్డులకు విస్తరణ..*  *ప్రచురణ ఫారం-1 కాపీని విడుదల చేసిన కమిషనర్ కిరణ్ కుమార్..*

పాలకొల్లు సూర్య న్యూస్  పట్టణం గత 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి న్యాయస్థానం నుండి తీర్పు రావడం, ప్రభుత్వం నుండి జీవో వెలువడటంతో పురపాలక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పురపాలక సంఘం చుట్టుపక్కల ఉన్నటువంటి విలీన గ్రామాలకు ఎట్టకేలకు ఉపశమనం కలిగింది.  గతంలో 31 వార్డులుగా ఉన్నటువంటి పురపాలక సంఘం పాలకొల్లు మండలం పాలకొల్లు రూరల్, పూలపల్లి, భగ్గేశ్వరం, ఉల్లంపర్రు,   వరిధనం, ఎలమంచిలి మండలం అడవిపాలెం, కొంతేరు గ్రామాలను విలీనం చేస్తూ 35 వార్డులుగా విస్తరించడం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించడంతో గత ఏడేళ్లుగా ఎన్నికలు జరగకపోగా ఈ గ్రామాలన్ని ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకొనడంతో ఎట్టకేలకు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ వారి ఉత్తర్వులతో  మార్గం సుగుమం అయినది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ డి. కిరణ్ కుమార్ పురపాలక సంఘ పరిధిలోని  వార్డుల డి-లిమిటేషన్ ప్రచురణ ఫారం-1 కాపీని  గురువారం మీడియాకు విడుదల చేశారు. 35 వార్డుల నుండి 44 వార్డులుగా పునర్విభజన చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 64 తేదీ 24-03- 2026 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ప్రకారం, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్ట్టోరల్ రోల్స్ ఆధారంగా  అక్టోబర్ 6న విడుదల చేసిన జీవో ప్రకారం 35 వార్డుల నుండి 44 వార్డులకు పునర్విభజన చేసినట్లు దీనికి సంబంధించి ఈ నెల 14వ తేదీ లోపు అభ్యంతరాలు స్వీకరిస్తామని కమిషనర్ డి. కిరణ్ కుమార్ మీడియా ద్వారా పురజనులకు వెల్లడించారు. గురువారం నుండి పబ్లిక్ నోటీస్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలియజేశారు.