BREAKING
సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం

దేవరగట్టు బన్ని ఉత్సవాలను ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి*

Select Suryaa Now
దేవరగట్టు బన్ని ఉత్సవాలను  ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి*

 

*ఉత్సవాల నిర్వహణకు వీలుగా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి*

 *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్*

కర్నూలు, అక్టోబర్ 7: దేవరగట్టు బన్ని ఉత్సవాలను  ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.

 

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేవరగట్టు బన్ని ఉత్సవాల ఏర్పాట్ల పై   సంబంధిత శాఖల జిల్లా అధికారులు, హోళగుంద, హాలహర్వి, ఆలూరు మండలాల అధికారులు, సంబంధిత గ్రామాల పెద్దలతో సమన్వయ  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లపై సమీక్షించారు

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఉత్సవ ప్రాంతం, ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.  విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, వాటర్ ట్యాంకులు, భవనాలు, చెట్లపైకి ఎక్కకుండా బారికేడింగ్, పోలీసు బందోబస్తు పటిష్టం చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసు అధికారులు, తహశీల్దార్లు  కలిసి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని  ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.   సంబంధిత శాఖల అధికారులు  ముందుగా వెళ్లి  అవసరమైన ఏర్పాట్లను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. గత సంవత్సరాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఏర్పాట్లను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. దేవరగట్టు, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాలకు  వెళ్లే ప్రధాన మార్గాల్లో గుంతలను గుర్తించి ఉత్సవానికి ముందే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. శాశ్వత పనులు పూర్తయ్యే వరకు అవసరమైన తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు. ఆలయ పరిసరాలు, రద్దీ ప్రాంతాలు, చీకటి ప్రదేశాల్లో తగినంత లైటింగ్, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట టార్చ్ లైట్లు, ఇతర లైటింగ్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన చోట జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఎస్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పారిశుద్ధ్య సిబ్బందిని అవసరమైన షిఫ్టుల్లో అందుబాటులో ఉంచి, తగిన సంఖ్యలో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, అవసరమైన చోట భద్రతా ఏర్పాట్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేందుకు సంబంధిత అనుమతులను త్వరగా పొందాలని ఆదేశించారు. ఉత్సవ సమయంలో అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవరగట్టు 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కలెక్టర్డీఎంహెచ్ఓ ను   ఆదేశించారు. అంబులెన్స్ లు, అదనపు స్ట్రెచర్లు, వీల్‌చైర్లు, మందులు తగినంతగా సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రతి అంబులెన్స్ కు అదనంగా 6–7 స్ట్రెచర్లు అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో త్వరగా తరలించేలా ఆంబులెన్సులకు ప్రత్యేక ఎగ్జిట్ మార్గాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.  ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ తదితర వైద్య నిపుణులతో పాటు స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల వద్ద రోగులతో వచ్చే వారి రద్దీని నియంత్రించేందుకు పోలీసు సిబ్బంది,  ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉత్సవానికి వచ్చే భక్తులకు తాగునీటి కొరత లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో సమృద్ధిగా నీటి వసతులు కల్పించాలని ఆదేశించారు.  అగ్నిప్రమాదాలను నివారించేందుకు తగిన సంఖ్యలో ఫైర్ టెండర్లను సిద్ధంగా ఉంచాలని, ఇరుకైన మార్గాల్లోకి వెళ్లగల చిన్న ఫైర్ టెండర్లను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉత్సవ సమయంలో డ్రై డేస్ అమలు, అక్రమ మద్యం రవాణా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  గ్రామస్థాయిలో వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలు, సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఉత్సవ సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉత్సవ నిర్వహణలో భద్రత, ప్రజల అవగాహన, శాఖల మధ్య సమన్వయం ప్రధాన అంశాలుగా తీసుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. గతంలో బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో తగినంత లైటింగ్‌ లేకపోవడంతో, ఈసారి ఆయా ప్రాంతాల్లో అదనపు లైటింగ్‌ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచి, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఇరుకుగా ఉన్న రహదారులను గుర్తించి అవసరమైన మరమ్మతులు, సరిదిద్దే పనులను చేపట్టాలని, రోడ్లు ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో లోపలికి వెళ్లేందుకు వీలుగా చిన్న పరిమాణంలో అగ్నిమాపక వాహనాలు, పరికరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎక్సైజ్‌, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి నాటుసారా, అక్రమ మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్రలకు ఇనుప రింగులు అమర్చిన వాటిని ముందుగానే గుర్తించి స్వాధీనం చేసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఉత్సవ ప్రాంతంలోని పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి, వాటిపైకి ప్రజలు ఎక్కకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల్లో దివిటీలను విసరడం జరుగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ అంశాల్లో  గ్రామస్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ  రెవెన్యూ,పోలీస్ అధికారులను  ఆదేశించారు. దేవరగట్టు ఉత్సవ ప్రాంతం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వ్యక్తులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి, నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాల నిఘా, భద్రతా చర్యలపై ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. బన్ని ఉత్సవం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా గ్రామస్థులు, భక్తులు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు.

అనంతరం శ్రీశ్రీ శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవముల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీవో ఓబులేసు, ఆదోని ఆర్డీవో అరుణ దేవి, తదితరులు పాల్గొన్నారు