BREAKING
ముంబైలో హోరెత్తుతున్న సీజేపీ ఆందోళన: సీఈసీ రాజీనామాకు డిమాండ్ అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం కోల్‌కతాలో బ్రెజిల్, భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీ గురుమూర్తి మదనపల్లె జెపి తైక్వాండో విద్యార్థులకు పతకాల పంట టాటా సన్స్ బోర్డులో వివాదం, చంద్రశేఖరన్ పునర్నియామక ఓటింగ్ సమావేశం వీడియో, మినిట్స్ కోరిన నోయెల్ టాటా శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి ఘటన, వైరల్ వీడియోలతో కలకలం, స్వయంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూడూర్‌లో వాటర్ ట్యాంకర్ రెండు టైర్లు చోరీ చేవెళ్లలో 11 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు రామేశ్వరం విమానాశ్రయానికి కేంద్రం అనుమతి కోరనున్న తమిళనాడు ప్రభుత్వం వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సిరమ్మ అభినందనలు ఆత్మహత్య చేసుకున్న రైతు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాల నిరసనలు, తప్పుదారి పట్టించే ప్రచారమంటూ బెంగాల్, బీహార్ బీజేపీ నేతల విమర్శలు

దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్: అక్టోబర్ 14, 15న భారత రాష్ట్రపతి రాక

Select Suryaa Now
దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్: అక్టోబర్ 14, 15న భారత రాష్ట్రపతి రాక

 విజయవాడ, సూర్య ప్రతినిధి :బెజవాడ కీర్తిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచస్థాయిలో చాటిచెప్పేలా "విజయవాడ ఉత్సవ్" వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ రూపుదిద్దుకుంటున్న ఈ బృహత్తర వేడుకల్లో భాగంగా అక్టోబర్ 14, 15 తేదీల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడలో పర్యటించనున్నారని ఆయన వెల్లడించారు.

నగరానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను డిజైన్ చేశారు. "విజయవాడలో ఏ కార్యక్రమం చేపట్టినా సూపర్ హిట్ అవుతుంది" అని పేర్కొన్న ఎంపీ చిన్ని, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో బెజవాడ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల ప్రాధాన్యాన్ని మరింత పెంచుతూ నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ మారథాన్’కు ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 22 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకోవడం విశేషం. భారత రాష్ట్రపతి రాకతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానుండటంతో అధికారులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.