BREAKING
*దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు* సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య... వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతినే మార్చింది మాజీమంత్రి హరీశ్‌రావు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వ్యాఖ్య సిద్దిపేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు హరీశ్‌రావు వ పంచాయతీల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత : బసినికొండ టిడిపి సర్పంచ్ అభ్యర్థిని సి.అనిత వెల్లడి : మంచం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని వినతి గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం.. తట్టివారిపల్లి సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా : వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవి వెల్లడి :కత్తెర గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని మనవి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభకి సలాం : సహస్ర ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రామిరెడ్డి అభినందనలు : కోచ్ మురళి శిక్షణకి ప్రత్యేక ప్రశంసలు ప్రధాని మోదీ 'మన్ కి బాత్' ప్రతి బూత్ స్థాయిలో విస్తృతంగా జరగాలి ఫూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో ఎందుకీ నిర్లక్ష్యం.. నగర ప్రజాప్రతినిధులారా.. కళ్లుతెరవండి నాటకాలు వద్దు డాక్టర్ పోతుల నాగరాజు.. ఎల్ కోట జామి వీధి లో భారీ శబ్దం తో పేలిన కుక్కర్ వంటగది చిందరవందర.. తృటిలో తప్పిన ప్రమాదం వేధింపులతో మహిళ ఆత్మహత్య ఓటెత్తారు...... రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి.... 85.78 శాతం భారీ పోలింగ్ నమోదు

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనలకు ఏపీ బీజేపీ సంపూర్ణ మద్దతు – ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

Select Suryaa Now
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనలకు ఏపీ బీజేపీ సంపూర్ణ మద్దతు  – ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

విశాఖపట్నం మేజర్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. “నారీ శక్తి వందన్ అధినియమ్“ అనేది లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు మరియు ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు 33% (మూడింట ఒక వంతు) సీట్లు రిజర్వ్ చేసే రాజ్యాంగ సవరణ చట్టం. దశాబ్దాలుగా మహిళలు ఎదురుచూస్తున్న రాజకీయ ప్రాతినిధ్య హక్కును సాకారం చేసే దిశగా ఈ ప్రతిపాదనలు కీలక ముందడుగుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి సుమారు 815కు పెరిగే అవకాశం ఉందని, అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి సుమారు 38కు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్ 30 నుంచి జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాల వాటా నిష్పత్తిని 2051 అనంతర జనాభా లెక్కల గణాంకాలు ప్రచురితమయ్యే వరకు కొనసాగించే అంశం ఈ ప్రతిపాదనల్లో ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి రక్షణ కల్పించడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడం ఈ ప్రతిపాదనల్లో మరో ముఖ్యమైన అంశమని మాధవ్ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అమలును 2026 జనాభా లెక్కల ప్రక్రియతో ముడిపెట్టకుండా ముందుకు తీసుకెళ్లే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. ఈ 33 శాతం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా వాటా కల్పిస్తారని, ఈ రిజర్వేషన్లు 15 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా ప్రతిపాదించారని తెలిపారు. ప్రతి ఎన్నికల అనంతరం రిజర్వు చేసిన నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో మార్చే విధానం కూడా ఇందులో భాగంగా ఉందని వివరించారు. పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర శాసనసభల్లోనూ మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజకీయ నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని, ఇది మహిళా సాధికారతకు మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య సమతుల్యతకు ఎలాంటి విఘాతం కలగకుండా, రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల వాటా నిష్పత్తిని కొనసాగించే అంశానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మాధవ్ వివరించారు. ఈ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించి మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య సమతుల్యత, మహిళా సాధికారత, ప్రజాస్వామ్య బలోపేతం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పునరుద్ఘాటించారు.