డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీ కేసులో వైసీపీ నేతలకు 41ఏ నోటీసులు..
ఇందుకూరుపేట, మేజర్ న్యూస్ : డీఎస్సీ అక్రమాలపై నిరసనగా 10-08-2026న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందుకూరుపేటలో నిర్వహించిన నిరసన ర్యాలీకి సంబంధించి ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్‌లో 19 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసులో భాగంగా నేడు మాజీ మంత్రి నల్లపరెడ్డి తోపాటు పలువురు వైసీపీ నాయకులు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్‌లో హాజరై 41A నోటీసులు అందుకున్నారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పీఏసీసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర CEC సభ్యులు పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, వైసీపీ సీనియర్ నాయకులు కొండూరు వెంకట సుబ్బారెడ్డితో పాటు వైసీపీ నాయకులు గొల్లపల్లి విజయకుమార్, మవులూరు శ్రీనివాసులురెడ్డి, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, షేక్ షాహుల్, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, చెర్లో సతీష్ రెడ్డి, కందుకూరి యానాది రెడ్డి, తుమ్మల ప్రసాద్ రెడ్డి, గండవరపు వివేకానంద రెడ్డి, బొచ్చు శ్రీనివాసులు, నెలవాయి మాణిక్యరావు తదితరులు పోలీస్ స్టేషన్‌లో 41ఏ నోటీసులు అందుకున్నారు.. డీఎస్సీ అక్రమాలపై ప్రజల తరఫున శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే ప్రయత్నమని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని, అక్రమ కేసులకు భయపడేది లేదని వారు స్పష్టం చేశారు..