దశాబ్దాల నెల్లిమర్ల ప్రజల కల సాకారం
– కొప్పెర్లలో నూతన ఫైర్ స్టేషన్ ప్రారంభం
పూసపాటిరేగ, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్:
దశాబ్దాలుగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న అగ్నిమాపక కేంద్రం కల ఎట్టకేలకు సాకారమైంది. అత్యవసర సమయాల్లో అగ్నిమాపక సేవలు అందుబాటులో లేకపోవడంతో గతంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రత్యేక చొరవతో, పట్టుదలతో కృషి చేశారు. ఈ కృషి ఫలితంగా పూసపాటిరేగ మండలం కొప్పెర్లలో సుమారు రూ.2.25 కోట్ల వ్యయంతో నూతన ఫైర్ స్టేషన్ నిర్మాణం చేపట్టి కేవలం 12 నెలల్లోనే పూర్తి చేశారు. ఆధునిక సదుపాయాలతో, విశాలమైన ప్రాంగణంలో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ ఫైర్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోసం ఎన్నో ఏళ్లుగా ఉన్న అవసరాన్ని గుర్తించి, దానికి పరిష్కారం చూపించడంలో లోకం మాధవి ప్రత్యేక చొరవకు ఇది ఒక నిదర్శనంగా నిలిచింది. “ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయం అందాలి.. అత్యవసర సమయంలో ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదు” అనే సంకల్పంతో చేసిన కృషికి ఈ ఫైర్ స్టేషన్ సాకార రూపం. హోంమంత్రి వంగలపూడి అనిత విజయనగరం ఫైర్ స్టేషన్ నుంచి వర్చువల్‌గా కొప్పెర్ల నూతన ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి , విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజ, బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన , మంత్రి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, కలెక్టర్ శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి , జిల్లా అగ్నిమాపక అధికారి పి.వి. సాయి రాజేష్ డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.