BREAKING
ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా భారతీయ సినిమాకు బాలీవుడ్ అందించిన చరిత్రాత్మక సేవలు: మూలాలు మొదలు ఆధునిక మార్పుల వరకు! గిద్ద పెరుమాండ్ల టెంపుల్‌లో జమ్మి పూజలో పాల్గొన్న ఆకుల నరసన్న పటేల్ 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి వైరల్ కావడమే నేటి యువత పరమావధిగా మారిందా: సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక ఉన్న చేదు నిజాలు! ఓటీటీల హవా ప్రభావం: చిన్న సినిమాలకు సువర్ణావకాశమా లేక థియేటర్లకు పెను ముప్పు ? ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం... జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ బాలీవుడ్‌లో కలకలం రేపిన కాల్పుల ఘటన: టైగర్ ష్రాఫ్ కారుపై దాడితో అప్రమత్తమైన స్టార్లు దాసరి యాకోబు మృతి పార్టీకి తీరనిలోటు......... పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫుట్‌పాత్ లేదు.. రక్షణ కరవు: ట్రాఫిక్ మధ్యే స్కూటర్‌పై వెళ్తున్న ఈటన్‌విల్లే దివ్యాంగుడు.. విస్తరణ పనుల వేళ తప్పని అవస్థలు! ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 ట్రైలర్ విడుదల: మరింత భీకరంగా సౌరాన్ ప్రయాణం! ఆరెంజ్ కౌంటీ టీచర్ల కాంట్రాక్ట్ వివాదం: స్కూల్ బోర్డు కీలక సమావేశం వాయిదా.. హెల్త్ ఇన్సూరెన్స్ అంశంపై పీటముడి! బిగ్‌బాస్ హౌస్‌లో ఓటింగ్ ట్రెండ్ సంచలనం: రోహిత్ గ్రాఫ్ పతనం, డబుల్ ఎలిమినేషన్‌పై ఊహాగానాలు! వాతావరణ మార్పుల పోరులో ప్రపంచానికి ఎదురుదెబ్బ: అమెరికా విధానాలే ప్రధాన కారణమంటూ యూఎన్ సంచలన నివేదిక!

దారి తప్పిన వృద్ధురాలు.. క్షేమంగా చేర్చిన పోలీసులు!

Select Suryaa Now
దారి తప్పిన వృద్ధురాలు.. క్షేమంగా చేర్చిన పోలీసులు!

గాజువాక, సూర్య : రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో కనిపించిన 70 ఏళ్ల వృద్ధురాలిని స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు చేరదీసి, మానవతా దృక్పథంతో గంటల వ్యవధిలోనే కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్టీల్‌ప్లాంట్‌ పీఎస్‌ పరిధిలో సిబ్బంది మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ వృద్ధురాలు రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే ఆమెను ఆపి వివరాలు అడగ్గా, ఇంటి నుంచి బయటకు వచ్చి తిరుగు ప్రయాణంలో దారి మరిచిపోయినట్లు తెలిసింది. వయసు పైబడటంతో తన ఇంటి చిరునామా కూడా ఆమె స్పష్టంగా చెప్పలేకపోయారు. దీంతో సిబ్బంది ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె చెప్పిన కొద్దిపాటి వివరాల ఆధారంగా సోషల్‌ మీడియా ద్వారా ఆరా తీసి, కుటుంబ సభ్యుల ఆచూకీ కనుగొన్నారు. వెంటనే ఆమె కుమారుడికి సమాచారం అందించి స్టేషన్‌కు పిలిపించి, వృద్ధురాలిని క్షేమంగా అప్పగించారు. సమయానికి స్పందించి తన తల్లిని చేరదీసిన పోలీసులకు ఈ సందర్భంగా కుమారుడు కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.