డాలర్స్ దివాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార ప్రభంజనం
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలంలో జడ్పిటిసి, ఎంపిటిసిల గెలుపు కోసం డాలర్స్ దివాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి యువత జే జే లు కొడుతూ ఉత్సాహబరితంగా సాగింది. తెలుగు తమ్ముళ్లు డాలర్స్ దివాకర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అభిమానాలతో తమ భుజాల మీద మోసుకొని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ప్రచారంలో డాలర్స్ రాకతో ముందున్నడు లేని నూతన ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలలో మునిగితేలారు. తెలుగు తమ్ముళ్ల నూతన ఉత్సాహంతో డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రభంజనంతో తిరుపతి రూరల్ మండలంలో భారీ మెజార్టీతో జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల విజయం సాధిస్తారని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.