BREAKING
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు! కుంకుమ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీచౌడేశ్వరి దేవి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కుమ్ర భుజంగ్ రావ్ కు సన్మానం ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న 'ఇరుముడి' నటి సామ్.. క్యూట్ ఫోటోలు వైరల్! ఇర్విన్ రిజర్వాయర్ రద్దుకై ప్రజావాణిలో భూనిర్వాసిత రైతుల వినతి పోలీసుల పట్ల ప్రజలలో నమ్మకం పెంచేలా సమస్యల పరిష్కారం ఉండాలి; జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ చేసి హత్య చేసిన భార్య భర్తల అరెస్ట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొనసాగుతున్న చేరికలు షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.50 వేల ఆస్తి నష్టం తమిళ దర్శకుడితో రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ.. ఇండియానా జోన్స్ తరహాలో భారీ అడ్వెంచర్ థ్రిల్లర్! చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి నిహారిక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జీసీసీ బాధిత కార్మికులకు న్యాయం చేయాలి ప్రజావాణికి 12 దరఖాస్తులు శ్రీరాముడి వేషధారణలో అనుపమ ఫేమ్ గౌరవ్ ఖన్నా.. రణ్‌బీర్ కపూర్‌కంటే అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు!

చిత్రలేఖన పోటీల్లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి విద్యార్థిని షేక్ అప్సర్‌కు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు

Select Suryaa Now
చిత్రలేఖన పోటీల్లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి విద్యార్థిని షేక్ అప్సర్‌కు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు

చిలకలూరిపేట మేజర్ న్యూస్: రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించి పట్టణానికి పేరు తెచ్చిన ఎస్‌పిటిఆర్‌కెఎం స్కూల్ విద్యార్థిని షేక్ అప్సర్‌ను మాజీ మంత్రి,చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు.విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీల్లో అప్సర్ ప్రతిభ చాటుకుని ప్రథమ బహుమతి సాధించింది.ఈ సందర్భంగా సోమవారం ఆమెను తన నివాసానికి ఆహ్వానించిన ప్రత్తిపాటి పుల్లారావు శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు మరిన్ని విజయాలు సాధిస్తారని అన్నారు.చదువుతో పాటు చిత్రలేఖనం,క్రీడలు,ఇతర సృజనాత్మక రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు.చిన్న వయసులోనే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించడం అభినందనీయమని,ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జాతీయ,అంతర్జాతీయ స్థాయిల్లోనూ గుర్తింపు పొందాలని షేక్ అప్సర్‌ను ఆశీర్వదించారు.విద్యార్థుల విజయాలు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులతో పాటు పట్టణానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు.

రిపోర్టర్:కొణిదెన నరేంద్ర చిలకలూరిపేట ఆర్సి ఇంచార్జ్