BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

చిన్న శ్రీను, సిరమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన గుర్ల మండల టీడీపీ నాయకులు

Select Suryaa Now
చిన్న శ్రీను, సిరమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన గుర్ల మండల టీడీపీ నాయకులు

విజయనగరం, అక్టోబర్ 08:

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుమార్తె సిరమ్మలను గుర్ల మండలానికి చెందిన టీడీపీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని గుర్ల మండల మాజీ జెడ్పీటీసీ కిరణ్ రాజు, మాజీ ఎంపీపీ ఎన్ని సన్యాసినాయుడు ఆధ్వర్యంలో ధర్మపురిలోని 'సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్' వద్ద ఈ కార్యక్రమం జరిగింది. సిరమ్మ నూతనంగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో పాటు, 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సుమారు 400 మంది నాయకులు, కార్యకర్తలు వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరం కలిసికట్టుగా శ్రమించాలని, టీడీపీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గుర్ల మండలంలోని నడుపూరు, బూర్లిపేట, తెట్టంగి, చుక్కపేట, జమ్మూపేట, కెల్ల, పోలాయవలస, చోడవరం, గుర్ల, దేవుని కనపాక, పున్నపురెడ్డిపేట, చింతపల్లిపేట, అచ్యుతాపురం, గిరిడి, రౌతుపేట తదితర 15 గ్రామ పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

విజయనగరం: చిన్న శ్రీను, సిరమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన గుర్ల మండల టీడీపీ నాయకులు

విజయనగరం, అక్టోబర్ 08: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుమార్తె సిరమ్మలను గుర్ల మండలానికి చెందిన టీడీపీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.