BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

చిన్న శ్రీను, సిరమ్మలను అంబలం పూజకు ఆహ్వానించిన కోనమసివానిపాలెం భవానీలు

Select Suryaa Now
చిన్న శ్రీను, సిరమ్మలను అంబలం పూజకు ఆహ్వానించిన కోనమసివానిపాలెం భవానీలు

విజయనగరం, అక్టోబర్ 08:

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుమార్తె సిరమ్మలను ఎస్.కోట నియోజకవర్గం, ఎల్.కోట మండలం కోనమసివానిపాలెం గ్రామానికి చెందిన భవానీ మాలధారులు, టీడీపీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ధర్మపురిలోని 'సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్'లో చిన్న శ్రీను నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇటీవలే టీడీపీలో చేరి 'చిన్న శ్రీను సోల్జర్స్' అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సిరమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమ గ్రామంలో నిర్వహించనున్న అంబలం పూజకు హాజరుకావాల్సిందిగా చిన్న శ్రీను, సిరమ్మలను భవానీలు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ దూది సత్యనారాయణ, మాజీ వైస్ ప్రెసిడెంట్ దూది అప్పలనాయుడు, కాకర శ్రీను, కాకర శ్రీనివాసరావు, సతీష్, వార్డు మెంబర్ పి.తాతాలు, పాఠశాల కమిటీ చైర్మన్ కోన అప్పలరాజుల ఆధ్వర్యంలో సుమారు 50 మంది భవానీ దేవుళ్ళు, గ్రామ టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.