ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా మద్దుల మురళీకృష్ణ
రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో, 2026-28 సంవత్సరములకు చాంబర్ నూతన అధ్యక్షునిగా మద్దుల మురళీకృష్ణ గారిని మిగిలిన పాలకవర్గం కార్యవర్గం యధాతధంగా కొనసాగుటకు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తవ్వా రాజా చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు , బాలనాగు బలేష్ గుప్తా చాంబర్ పాలకమండలి సభ్యులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. చాంబర్ గౌరవ కార్యదర్శిగా శ్రీ ఆకుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా వంటెద్దు సూరిబాబు ఇయ్యపు మురళీధర్ గారు, ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు కనకాల రాజా గారు, గౌరవ సంయుక్త కార్యదర్శిగా తోట లక్ష్మీనారాయణ కన్నా కోశాధికారిగా అల్లంకి నాగేశ్వరరావు ట్రస్ట్ బోర్డ్ కార్యదర్శిగా పచ్చిగోళ్ళ సురేష్ కుమార్ కర్యవర్గ సభ్యులు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడగా, వారికి వివిధ వర్తక సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేసినారు.