BREAKING
మోదీ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం ‘తత్వం’ విజయం సాధిస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం.. దర్శకుడు అర్జున్ కోలా కామెంట్స్! ఖాళీ అవుతున్న వైసీపీ - నిబద్ధత తో జనసేనా పార్టీ కి పనిచేస్తాను - మన్నెమాల సుకుమార్ రెడ్డి రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా ‘రామాయణం’ స్పెషల్ బీటీఎస్ గ్లింప్స్ విడుదల! మల్లేశ్వరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహోత్సవం పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌

చెల్లాపురం విద్యాకమిటీ ఎన్నికల్లో టీడీపీకి షాక్.!

Select Suryaa Now
చెల్లాపురం విద్యాకమిటీ ఎన్నికల్లో టీడీపీకి షాక్.!


ఇండిపెండెంట్ రెడ్డివరం ప్యానెల్ గెలుపు.!

మెరకముడిదాం, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్: మెరకముడిదాం మండలం చెల్లాపురం పంచాయతీ లో మంగళవారం జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీడీపీ కి భారీ షాక్ తగిలింది. రెడ్డి. వరం బలపరిచిన ఇండిపెండెంట్ ప్యానల్ విజయ దంఖా మోగించింది. నాలుగింటిలో  రెండు రెడ్డి.వరం బలపరచిన ఇండిపెండెంట్ ప్యానెల్ గెలుచుకుంది. అధికార పార్టీ నాయకుడు ఒకరు" సామ ,దాన, భేద ,దండోపాయాలు" ఓటర్లు పై ప్రయోగించినా, నాలుగింటిలో ఒక్క పాఠశాల చైర్మన్ ను మాత్రమే టీడీపీ పార్టీ గెలవగలిగింది. టిడిపి, వైసీపీ మిలాఖత్ అయ్యి కలిసి పోటీ చేసినా, ఇండిపెండెంట్ రెడ్డి. వరం బలపరచిన ప్యానెల్ సభ్యులే రెండింట గెలిచారు. టిడిపి పార్టీ నాయకులు ఓటర్ల ను ఓటు వేయకపోతే ఇల్లు ఇవ్వమని, స్కీములు ఆపేస్తామని ఎంత బెదిరించినా , విద్యా కమిటీ ఎన్నికల్లో ఓటరు నిజాయితీకి పట్టం కట్టారు. మాజీ సర్పంచ్ రెడ్డి.వరం బలపరచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయ డంఖా మోగించారు. పంచాయతీ లో నాలుగు విద్యా కమిటీలకు ఎన్నికలు జరగగాయి. ఇందులో చినరవ్యాం పాఠశాలలో లో లావేటి. శ్రీను వాసరావు కిలారిపేట పాఠశాలలో దన్నాన. రవి లు రెడ్డి. వరం మద్దతు దారులే గెలుపొందారు. ఇక విశ్వనాధపురం పాఠశాల విద్యాకమిటీ వైయస్సార్ పార్టీ గెలుపొందింది. టిడిపి  ఒకటి గెలుచుకుంది. టిడిపి పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు టిడిపి పార్టీ కి షాకిచ్చాయనే చెప్పాలి. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకొని, మిలాఖాత్ అయ్యి పోటీకి దిగినా చేరొకటి గెలుచుకోగా ఇండిపెండెంట్ రెడ్డి. వరం ప్యానెల్ రెండు గెలుచుకుంది. అన్నా మీ వెంటే మేమున్నామంటూ" మొక్కవోలి ధైర్యంతో ఎన్ని బెదిరింపులు కు గురి చేసినా, విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయం పైనే నిలిచారు.  రెడ్డి. వరం యొక్క ఇండిపెండెంట్ ప్యానెల్ ను గెలిపించారు. విద్యా కమిటీ లు రాజకీయాలకు అతీతంగా పనిచేసేందుకు, విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేసేందుకు తల్లి దండ్రులు తో కమిటీలు వేసింది ప్రభుత్వం. కానీ ఇక్కడ కొందరు రాజకీయ నేతలు ఈ కమిటీలను రాజకీయంగా వాడుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వస్తున్నాయి. విద్యా కమిటీలో చెప్పిన వారికి ఓటు వేయకపోతే పథకాలు ఇవ్వమన్నారు. అయినా తల్లి దండ్రులు లో ధైర్యం సడలలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా న్యాయం వైపే మొగ్గు చూపారు. ఇండిపెండెంట్ లను గెలిపించారు.  అధికారం ఉంది కదా! అని" అరచేతిని అడ్డం పెట్టి సూర్యున్ని" ఆపేద్దామని అనుకున్నవారికి ఈ పాఠశాల ఎన్నికలు గుణపాఠం కావాలని ప్రజలు విశ్వసిస్తున్నారు.