చౌడువాడలో వైకాపా ఇంటింటి ప్రచారం
పూసపాటిరేగ, సూర్య : మండలంలోని చౌడువాడ ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలో వైకాపా ఎన్నికల ప్రచారం శుక్రవారం శుక్రవారం జోరుగా సాగింది. వైకాపా తరుపున రామస్వామి పోటీ చేస్తుండగా అందుకు మద్దతుగా వైకాపా నాయకుడు నాగబాబు, శ్రావణులు ప్రచారాన్ని నిర్వహించారు. గతంలో రామస్వామి కుటుంబం ఎంపీటీసీ తో పాటు సర్పంచ్ గా పలుమార్లు ఆదరించారని, అదే ఆదరణతో పోటీ చేస్తున్న అభ్యర్థి రామస్వామి గ్రామాలలో అభివృద్ధి చేసిన విషయాన్ని నాగబాబు ఈ సందర్భంగా ఓటర్లకు గుర్తు చేశారు. రామస్వామిని మరోసారి గెలిపిస్తే మారుమూల ప్రాంతమైన చౌడువాడ ఎంపీటీసీ సెగ్మెంట్ను మండలంలోనే మోడల్ ప్రాదేశిక నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానన్న ఆశాభావాన్ని రామస్వామి వ్యక్తం చేశారు.