చతుర్విద ప్రక్రియ లు విద్యార్ధులకు నేర్పండి
- ఐటీడీఏ ఉపవిధ్యా శాఖాధికారి నారాయుడు
సీతంపేట: అక్కన్నగూడ, మెట్టుగూడ. జి పి ఎస్ ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఐటీడీఏ ఉపవిధ్యా శాఖాధికారి పాలక నారాయుడు ఆ కస్మంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించడమైనది. ప్రతి విద్యార్థికి చతుర్విధ ప్రక్రియలు (వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం) తప్పనిసరిగా వచ్చేటట్లు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే హైస్కూల్ విద్య మరింత బలంగా ఉంటుంది. కాబట్టి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులలో ప్రాథమిక భాషా మరియు గణిత సామర్థ్యాలు పటిష్టంగా ఏర్పడేలా కృషి చేయాలి.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరూ ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, వ్యక్తీకరించడం వంటి ప్రాథమిక ప్రక్రియలలో ప్రావీణ్యం సాధించేలా నిరంతరం సాధన చేయించాలి.ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని వ్యక్తిగతంగా గుర్తించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన, పునశ్చరణ మరియు నిరంతర అభ్యాసం అందించాలి.మన లక్ష్యం 1–5 తరగతుల ప్రతి విద్యార్థికి బలమైన పునాది – బలమైన ప్రాథమిక విద్య – మెరుగైన హైస్కూల్ విద్య.ఉపాధ్యాయులందరూ సమష్టి కృషితో ఈ లక్ష్యాన్ని సాధించాలని ఉపాధ్యాయులకు నారాయుడు సూచించారు. మెట్టుగూడ,అక్కన్న గూడ ఉపాధ్యులు సుశీల, చంద్రమ్మ లుపాల్గొన్నారు.