BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

చైతన్య రాజు జీవితం సౌపాల్య పురస్కారం

Select Suryaa Now
చైతన్య రాజు  జీవితం సౌపాల్య పురస్కారం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్ర

వైద్య, విద్యా,సామాజిక సేవా రంగాలతోపాటు తెలుగు భాషా వికాసానికి విశేష సేవలందిస్తున్న గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ కులపతి, అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల అధినేత, చైతన్య గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్యరాజు)కు అమెరికాలోని డల్లాస్‌ అడాప్ట్‌ ఏ విలేజ్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది.

వైద్య విద్యాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణలో చైతన్యరాజు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మూడు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కోవిడ్‌ సమయంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలిచారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

పూర్వ శాసనమండలి సభ్యుడిగా, ప్రభుత్వ విప్‌గా, ఈబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు. వైద్య, విద్యా, భాషా, సామాజిక రంగాల్లో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

తనకు ప్రతిష్ఠాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించిన అడాప్ట్‌ ఏ విలేజ్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ కమిటీ సభ్యులకు, భూపతిరాజు పండిత్‌కు చైతన్యరాజు కృతజ్ఞతలు తెలిపారు.