BREAKING
కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు

చైర్మన్ స్థానంతో సహా అన్ని వార్డుల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధం

Select Suryaa Now
చైర్మన్ స్థానంతో సహా అన్ని వార్డుల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధం


మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో చైర్మన్ అభ్యర్థితో సహా 48 వార్డు లలోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని  డిసిసి ఉపాధ్యక్షులు కొండుపల్లి ఆనంద్,మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే బాషాలు ప్రకటించారు.గురువారం శీనా టీ స్టాల్ ఏదురుగా ఉన్న మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
మదనపల్లె మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఇప్పటికే బలమైన అభ్యర్థులను పోటీకి నిలిపే విధంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమను సంప్రదిస్తే నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి ద్వారా డిసిసి మరియు ఏపిసిసిల దృష్టికి తీసుకెళ్లి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి నిలిపేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.మదనపల్లె నియో జకవర్గంతోపాటు మదనపల్లె మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే జరిగిన విషయాన్ని వారు గుర్తు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు నింపేవిధంగా అధిష్టానం గట్టి ప్రయత్నం చేస్తోందనికావున కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో బీసీలు,మహిళలు పోటీ చేయడానికి మెండుగా అవకాశాలు ఉన్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కుల,మత రాజకీయాలకు అతీతంగా నాయకులు రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,తద్వారా కాంగ్రెస్ పార్టీలో ఎదుగుదలకు అందరికీ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నత పదవులను అలంకరించారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.ఈ కార్య క్రమంలో పార్టీ నాయకులు సలీం,భాను,షబానా,నజీమ్ షేక్,తాజూన్,షమీం షేక్,అక్బర్,మంజునాథ్,సాదిక్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి