చదువుకున్నవారు, ఆలోచనాపరులు, విజన్ ఉన్నవారు కూటమికే మద్దతు ఇస్తున్నారు..
ప్రభుత్వం అంటే అరవడం కాదు.. వ్యక్తిగత దూషణలు కాదు.. తొడలు కొట్టడం అసలే కాదు. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించడమే నిజమైన పాలన. కిషోర్ గునుకుల విజయలక్ష్మీ గునుకుల
జనసేన-నెల్లూరు నగరం- 21(16)వ డివిజన్ లో కూటమి అభ్యర్థుల గెలుపుకై ప్రచారం..
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ : కోట్ల రూపాయల తో ప్రజలకు కళ్లకు కట్టినట్లు అభివృద్ధి పనులను చూపిస్తున్న కూటమి ప్రభుత్వం, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే మద్దతు ఇస్తామని ప్రజలు స్వచ్ఛందంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గత వైసీపీ రాక్షస రాచరిక పాలన మళ్లీ రావడానికి తాము సిద్ధంగా లేమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో గత కొన్ని రోజులుగా పాత 16వ డివిజన్, నూతన 21వ డివిజన్ పరిధిలో జనసేన పార్టీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఈరోజు కూడా ప్రతి గడపను తాకుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి గృహిణిని, ఇంటి పెద్దలను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ.. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న ప్రతి కుటుంబం కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. నేడు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న కోట్లాది రూపాయల పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలే పునాదిగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు నెల్లూరు నగరాన్ని కూడా సంక్షేమం, మౌలిక వసతులు, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంలో పొంగూరు నారాయణ కృషి కీలకంగా ఉంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వారి సతీమణి, వీరమహిళ విజయలక్ష్మి, లక్ష్మీ కుమారి, కృష్ణమోహన్ రెడ్డి, నరహరి, నాగేంద్రబాలు, ప్రశాంత్ గౌడ్, విజయ, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, కల్పన తదితరులు పాల్గొన్నారు.