BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

బుడమేరు కాలువలో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు

Select Suryaa Now
బుడమేరు కాలువలో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరంలో కాలువల పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం 1వ వార్డు, సర్కిల్-2 పరిధిలోని కార్మెల్ నగర్, గుణదల, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో బుడమేరు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులు చేపట్టారు. నగరపాలక సంస్థ జీవశాస్త్రవేత్త సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో పడవలు, పొడవాటి చేతి యంత్రాల సహాయంతో వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ కాలువల్లో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటిని ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సజావుగా సాగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పడవల ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నామని, పొడవాటి చేతి యంత్రాలతో కాలువల్లోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నామని వివరించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.