బోయకొండ గంగమ్మ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు!
పుంగనూరు :
ప్రముఖ శక్తి పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం నందు అమ్మవారికి బుధవారం ప్రధానినరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి సహకారంతో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ చిన్న రాయల్, బిజెపి నాయకుల ఆధ్వర్యంలో .దేశ సేవలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం మరింత బలోపేతం కావాలని,
వికసిత్ భారత్ సంకల్పం సాకారం కావాలని,దేశం మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భర భారతదేశంగా అభివృద్ధి చెందాలనిఅమ్మవారి ఆశీస్సులు ప్రధాని నరేంద్ర మోదీ కి లభించాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని
అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ టీం గంగా, దివాకర్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, శ్రీకాంత్ కూటమి నాయకులు పాల్గొన్నారు
రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు సూర్య రిపోర్టర్ అన్నమయ్య జిల్లా