బోనిలో గంటా రవితేజ ఎన్నికల ప్రచారం
ఆనందపురం, సూర్య : మండలంలోని బోని గ్రామంలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ యువనేత గంటా రవితేజ మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ కొనసాగింది. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. యువత ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. కూటమి శ్రేణుల సమష్టి కృషితో అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తాట్రాజు అప్పారావు, జనసేన జడ్పీటీసీ అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావు,కూటమి నాయకులు, నాగవంశం డైరెక్టర్ సురాల సత్యవరప్రసాద్, భుగత ప్రకాష్, అప్పలరాజు, సిర్ల అప్పలనాయుడు, సిర్ల రామునాయుడు, బూర్లె రమణ, శీర్లపాలెం సర్పంచ్ కోరాడ గౌరినాయుడు, కర్రి శ్రీనివాసరావు, కర్రి వెంకటరావు తదితర నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.