బొండా రవితేజ స్వామి వారి ఇరుముడి కార్యక్రమం వైభవం
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయులు, యువ నాయకులు బొండా రవితేజ స్వామి వారి ఇరుముడి కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ గవర్నర్‌పేటలోని కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో కేరళ మేల్‌శాంతి దామోదర్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణలు, ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణల నడుమ గురుస్వాముల సమక్షంలో ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు శ్రీకారం చుట్టారు. మండల దీక్షను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ స్వామివారి దర్శనమే లక్ష్యంగా యాత్రను ప్రారంభించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బొండా సుజాత, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ హాజరై రవితేజ స్వామికి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప స్వామి శరణుఘోషతో మార్మోగింది. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాల సమ్మేళనంగా ఇరుముడి కార్యక్రమం వైభవంగా సాగింది. అయ్యప్ప స్వామివారి దివ్య అనుగ్రహంతో బొండా రవితేజ స్వామి వారి శబరిమల యాత్ర సుఖసంతోషాలతో విజయవంతం కావాలని, స్వామివారి దివ్య దర్శనం లభించాలని, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అయ్యప్ప స్వామి భక్తులు ఆకాంక్షించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.