BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

బంగారు పతకం సాధించిన లక్ష్మీ అనూష - కమిషనర్ వై.ఓ. నందన్ అభినందనలు

Select Suryaa Now
బంగారు పతకం సాధించిన లక్ష్మీ అనూష  - కమిషనర్  వై.ఓ. నందన్ అభినందనలు


నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్

22వ వార్డు పరిధిలోని వార్డు సచివాలయంలో విద్యా, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్న తుమ్మల లక్ష్మీ అనూష, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ నుంచి ఎం.ఏ. (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు.
అక్టోబర్ 7న హైదరాబాద్‌లో జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్  సియా ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆమె బంగారు పతకాన్ని, పట్టాను అందుకున్నారు.
విధులు నిర్వర్తిస్తూనే, ప్రభుత్వ ఉద్యోగిగా తన బాధ్యతలకు ఎలాంటి ఆటంకం రాకుండా చదువును కొనసాగించి ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా 
కమిషనర్  వై. ఓ. నందన్ ఆమెను కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో గురువారం హృదయపూర్వకంగా అభినందించి, ఆమె కృషిని ప్రశంసించారు. ఇది సచివాలయ ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ, ఈ విజయం తన కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, అధికారుల ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.