భూ రికార్డుల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పోలేపల్లిలో జాయింట్ కలెక్టర్ పర్యటన
దుర్గి మండలంలోని పోలేపల్లి గ్రామంలో గురువారం పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ వి. సంజన సింహ పర్యటించి ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనుల పురోగతి, భూముల కొలతలు, భూ రికార్డుల వివరాలను పరిశీలించారు.రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు భూ రీసర్వేకు సంబంధించిన వివరాలపై అవగాహన కల్పిస్తూ, సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దుర్గి మండల తహసీల్దార్ వరకుమార్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.పేర్ల వెంకటేశ్వర్లు దుర్గి సీనియర్ రిపోర్టర్