BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

భక్తులకు మెరుగైన సేవలు

Select Suryaa Now
భక్తులకు మెరుగైన సేవలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి దేవస్థానం సిబ్బంది కృషి చేయాలని అయినవిల్లి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. శుక్రవారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ధర్మకర్తల మండలి చైర్మన్ అధ్యక్షతన కార్య నిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజు సమక్షంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది

 వినాయక చవితి మహోత్సవాలు  సందర్భంగా వివిధ విభాగాలకు చేసిన చెల్లింపులు, కొనుగోళ్లు, సేవలు, పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్, అలంకరణలు, అన్నప్రసాదం మరియు ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చులను విభాగాల వారీగా పరిశీలించి ఆమోదించారు. అన్నప్రసాదం మరియు ప్రసాదం తయారీ ప్రక్రియలో ఇటీవల తలెత్తిన సమస్యలు, వాటి కారణాలు, భవిష్యత్తులో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా దేవస్థానం తరఫున సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు మరియు నాణ్యతా ప్రమాణాలపై సమగ్రంగా చర్చించుట జరిగినది. కిరాణా సరుకులు మరియు కూరగాయలను దేవస్థానానికి దిగుమతి చేసుకునే సమయంలో ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలోనే స్వీకరించి దిగుమతి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తులాభారం ద్వారా వచ్చిన ప్రతి సరుకును దేవస్థానం అధికారికంగా స్వీకరించి, సంబంధిత స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేసి, అవసరాన్ని బట్టి అన్నప్రసాదం మరియు ఇతర దేవస్థాన అవసరాలకు వినియోగించే విధానంపై చర్చించారు. ఈ విషయమై వంతుదారులైన అర్చక స్వాములకు తమకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల వ్యవధిలోగా లిఖితపూర్వకంగా తెలియజేయలని తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక హోమానికి ప్రస్తుతం అమలులో ఉన్న రుసుమును పెంచే ప్రతిపాదనపై చర్చించుట జరిగినది. ప్రస్తుత రుసుము, హోమానికి అయ్యే వాస్తవ వ్యయం, వినియోగించే పూజా ద్రవ్యాలు, అర్చకులు/సిబ్బంది సేవలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకొని, ప్రత్యేక హోమం రుసుమును రూ.5,000/-గా నిర్ణయించుటకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. భక్తులకు దేవస్థానానికి చేరుకోవడానికి సులభంగా ఉండే విధంగా ప్రధాన రహదారులు, కూడళ్లు మరియు ముఖ్యమైన ప్రాంతాలలో మార్గ సూచికలు ఏర్పాటు చేయడం గురించి చర్చించారు. బోర్డులు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలు, పరిమాణం, సూచించాల్సిన వివరాలు, తెలుగు/ఇంగ్లీష్ భాషల్లో సూచనలు మరియు ఏర్పాటు ఖర్చు తదితర అంశాలను పరిశీలించారు. ఈ మేరకు 15 రోజుల వ్యవధిలోగా అవసరమైన అంచనాలు సిద్ధం చేయవలసిందిగా సంబంధిత అధికారులను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ముక్తీశ్వరం ఆలయాల ప్రాంతం నుండి వినాయక సదన్ వరకు రహదారి విస్తరణను పుష్కరాల నిధుల నుండి చేపట్టే అంశంపై చర్చించుట జరిగినది. ఈ రహదారి విస్తరణ ద్వారా భక్తులకు కలిగే ప్రయోజనం, ముఖ్యంగా పండుగలు మరియు అధిక రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల రాకపోకలకు సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చర్చించుట జరిగినది. ఈ పనులకు సంబంధించి స్థానిక గౌరవ శాసనసభ్యులు మరియు స్థానిక గౌరవ పార్లమెంటు సభ్యుల ద్వారా సంబంధిత నిధులు మంజూరు చేయించుటకు కోరుతూ, అవసరమైన చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆలయ ఏవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.