BREAKING
కొబ్బరి మొక్కలకు ద్రవ జీవామృతం పారిశుధ్య కార్మికులకు దసరా బోనస్ పంపిణీ సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత ఢిల్లీలో కాక్రోచ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు రుచులకు కొత్త చిరునామా.. * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌! వర్షాల కోసం కప్పతల్లి ఊరేగింపు స్విట్జర్లాండ్‌లో బ్యాంకింగ్ కుంభకోణాన్ని వెలికితీసిన సీనియర్ జర్నలిస్ట్‌పై క్రిమినల్ అభియోగాలు అక్రమ ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రమేష్ భక్తులకు టిక్కెట్లు -కళాకారులకు ఇక్కట్లు. అక్షిత విద్యార్థిని నీట్ కోచింగ్ కు సర్పంచ్ ఇమ్మడి మహేష్ ఆర్థిక చేయూత రాబోయే శీతాకాలం వేళ ఉక్రెయిన్‌కు ఉపశమనం వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు ఓటుకు నోటును తిరస్కరిద్దాం.. విలువైన ఓటు కు విలువనిద్దాం... ...... విద్వాన్ జ్యోతి చంద్రమౌళి...... శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు హంగేరీ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు

భక్తులకు లలిత త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చిన విజయ దుర్గమ్మ అమ్మవారు

Select Suryaa Now
భక్తులకు లలిత త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చిన విజయ దుర్గమ్మ అమ్మవారు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండపేట గాంధీనగర్ రైతు బజార్ వద్ద కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. జగన్మాత దివ్య అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సకల శుభాలను ప్రసాదించే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ అర్చకులు పిచ్చుక మధు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. భవాని మాలదారులు కు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు అభిషేకాలు నిర్వహించారు.