BREAKING
మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం రామాపురంలో పల్లెపండుగ ఏర్పాట్లు పరిశీలన మహిళల భద్రతే ధ్యేయం.. శక్తి యాప్‌పై విస్తృత అవగాహన వడ్డెరల భూములకు రక్షణ కల్పించండి సారూ..! ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణాన్ని విద్యార్థుల కల్పించాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అదిరిపోయే ట్విస్ట్.. సెకండ్ హాఫ్‌లో బాలయ్య సర్ప్రైజ్? రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి పల్లెపండుగ 3.0 కార్యక్రమం విజయవంతం చేయాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గ్రామ పంచాయితీ ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సేవలు అభినందనీయం సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 13 ఏళ్ల ఫర్హాన్‌ ఎక్కడ? ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

భగత్‌సింగ్‌కు జనసేన నాయకుల నివాళి

Select Suryaa Now
భగత్‌సింగ్‌కు జనసేన నాయకుల నివాళి


మెలియాపుట్టి. సెప్టెంబర్ 28. మేజర్ న్యూస్...
మెళియాపుట్టి మండలంలోని జలకలింగపురం గ్రామంలో భగత్‌సింగ్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం జనసేన పార్టీ నాయకులు నివాళులర్పించారు. పార్టీ నాయకుడు దుక్క బాలరాజు ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భగత్‌సింగ్‌ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం, యువతలో స్ఫూర్తి నింపిన త్యాగాలను నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించిన భగత్‌సింగ్‌ దేశం కోసం 1931 మార్చి 23న ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాణ జనార్దన్‌రావు, నక్క శ్యాంసుందర్‌రావు, నడిమింటి హిలంబిరావు, సేనాపతి సీతారం, సేనాపతి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.