BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

భాషలు, సంస్కృతిని కాపాడుకుంటూ ఐకమత్యంగా ఉండాలి

Select Suryaa Now
భాషలు, సంస్కృతిని కాపాడుకుంటూ ఐకమత్యంగా ఉండాలి

 నగరం, మేజన్ న్యూస్:  భారతదేశంలోని విభిన్న మతాలు, ఆయా రాష్ట్రాల్లోని భాషలు, సంస్కృతిని కాపాడుకుంటూ అందరూ ఐకమత్యంగా కలసి ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ నెల 5 -14 తేదీల్లో భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ, సాంస్కృతిక పరిశోధన శిక్షణా కేంద్రం సిసిఆర్టి, గౌహతిలో శిక్షణ అందించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ హమీన్ అన్సారియా రాష్ట్రం నుంచి ఎంపీపీ చేసిన 12 మంది ఉపాధ్యాయులను పంపారు. ప్రతిరోజు మూడు రాష్ట్రాలవంతన నిర్వహించే కార్యక్రమంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల్గొని మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట, ఉగాది, సంక్రాంతి, కోలాటం, థింసా డాన్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా, నగరం మండలం, సజ్జావారిపాలెం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆకిసెట్టి లక్ష్మీ విఠల్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా బీసు సుమల (అన్నమయ్య జిల్లా), మార్కాపురం జిల్లా నుంచి దోమల రవీంద్రబాబు, అన్నేబోయిన శ్రీనివాసులు, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి సీవీ భారతి, శ్రీకాకుళం జిల్లా నుంచి బొడ్డేపల్లి చక్రపాణి, తిరుపతి జిల్లా నుంచి కె ఎస్ పి ఎస్ జి బాబు, విజయనగరం జిల్లా నుంచి రాజశేఖర్ చింతల, వైయస్సార్ కడప జిల్లా నుంచి పుత్త లీలా కృష్ణయ్యలు పాల్గొన్నారు. అలాగే ఎస్ జి టి ఉపాధ్యాయులు గీతావాణి (అనంతపురం జిల్లా), ఆకిశెట్టి లక్ష్మీ విటల్ రావు (బాపట్ల జిల్లా), బండి ఎస్తేరు రాణి (గుంటూరు జిల్లా), మునగాల శెట్టి విజయభాస్కర్ (కర్నూలు జిల్లా)లు పాల్గొన్నారు. వీరు ప్రదర్శించిన తీరు పట్ల గౌహతి సిసిఆర్టి ఫీల్డ్ ఆఫీసర్ శశాంక్ పాండే అభినందన తెలిపారు.