BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

భారత్‌తో వాణిజ్య సంబంధాలకు విదేశీ విద్యార్ధులు దోహదం

Select Suryaa Now
భారత్‌తో వాణిజ్య సంబంధాలకు విదేశీ విద్యార్ధులు దోహదం

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : భారత దేశంతో వాణిజ్య సంబంధాలకు ఇతర దేశాల నుంచి విద్యాభ్యాసం కోసం విశాఖ ఇతర ప్రాంతాలకు వచ్చిన విదేశీ విద్యార్ధులు సహితం ముందుకు రావచ్చునని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారవచ్చునని విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ ఎస్.చవాన్ సూచించారు.  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్ధులతో     మంగళవారం  జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత దేశంలోని పర్యాటక ప్రాంతాలు, తక్కువ వ్యయం అయ్యే వైద్య సేవలు, ఉన్నత విద్య, ఆహర ప్రాసెసింగ్ పరిశ్రమలు విదేశీయులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరం సహితం మెడికల్ టూరిజం, ఉన్నత విద్య అభ్యాసానికి అనువైన కేంద్రంగా మారుతోందని ఆయన తెలిపారు.  విదేశీ విద్యార్ధులు తమ దేశాలలోని వాణిజ్య అవసరాలను గుర్తించి ఇక్కడ చదువుకునే సమయంలోనే ఎగుమతి, దిగుమతి దారులుగా మారాలని అందుకు తగిన ప్రోత్సాహకాన్ని మార్గదర్శకాన్ని తాము అందిస్తామని ఆయన తెలిపారు. భారత దేశంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించి తమ దేశంలోని పర్యాటకులకు పరిచయం చేయడం కూడా ఒక ఉపాధి మార్గంగా మలుచుకోవచ్చునన్నారు. అలాగే వారి దేశాలలోని వాణిజ్య అవసరాలపై ప్రాజెక్టు రిపోర్టు రూపొందించుకుని భారతదేశంలోని ప్రభుత్వ విభాగాల ద్వారా ఎగుమతి వాణిజ్యంపై అనుభవాన్ని పొందవచ్చునన్నారు. విదేశీ విద్యార్ధులకు అవసరమైన సహయాన్ని అందించడానికి తాము సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గీతం ప్రో`వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు పాల్గొని ముఖ్యఅతిధిని జ్ఞాపికతో సన్మానించారు.  గీతం సూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైరక్టర్  డాక్టర్ కె.తిరుపతిరావు, సిఎసఇ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి.వి.ఎస్.రాజ్‌కుమార్, విదేశీ  విద్యార్ధులు, పరిశోధకులు మరియు అధ్యాపకులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.