BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

బీసీ లకు చంద్రబాబు మరో మోసం

Select Suryaa Now
బీసీ లకు చంద్రబాబు మరో మోసం

రిజర్వేషన్లు జీఓ నిలబడదు అని తెలిసినా జీఓ ఇవ్వడం అంటే ప్రజలను మోసం చేయడమే
చిత్తశుద్ధి ఉంటే రాజ్యంగా సవరణ చేయించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయించాలి
ఎప్పుడూ ఎన్నికలు పెట్టిన మేము సిద్ధం 
వైసిపి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 
విజయనగరం ప్రతినిధి మేజర్ న్యూస్: బీసీ రిజర్వేషన్లు అమలు విషయంలో చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలకు చేసిన మోసం,దగా ,దుర్బుద్ధి మరోసారి బయట పడిందని, చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు కోర్టు పరిధిలో నిలబడదు అని తెలిసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించారని వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా చంద్రబాబు పై మండిపడ్డారు. శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 
బొత్స.సత్యనారాయణ మాట్లాడుతూ  
వెన్నుపోటు నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం మళ్లీ చేశాడు అన్నారు. 50 శాతానికి బీసీ రిజర్వేషన్లు మించకుడదానీ చెప్పిన తర్వాత మరల పార్టీ తరుపున  34 శాతం అమలు చేస్తామని చెప్పడం ఆయన మాయ  మాటలకు నిదర్శనమన్నారు. ప్రజలకు అవగాహన లేదని  ఇటువంటి వ్యాఖ్యలు చేయడం 
చాలా తప్పు అని అన్నారు. 34 శాతానికి జీఓ ఎప్పుడు విడుదల చేశారో ఆ రోజే నీ తాబేదార్ల తప్ప అందరూ ముక్తా కంఠంతో న్యాయస్థానంలో నిలబడదు అని చెప్పారన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమని  చెప్పడం జరిగిందన్నారు. అయినా సరే మోసం చేసి రిజర్వేషన్లు చేశావు, రాష్ట్ర కోర్టు కొట్టేసిందన్నారు. సుప్రీం  కోర్టుకు వెళ్లే బదులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాజ్యంగా సవరణ ఎందుకు చేయించలేకయావని ఆయన  ప్రశ్నించారు.చేతకాకపోతే  ఊరుకోవాలి తప్ప ఇటువంటి మోసం చేయడం  సరికాదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాజ్యంగా సవరణ చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు తీరు  క్షమించరానిదన్నారు. తెలిసి మోసం చేయడం అన్యాయమన్నారు. కౌన్సిల్ లో కూడా చెప్పడం జరిగిందన్నారు. 46 శాతాన్ని గత మా ప్రభుత్వంలో అమలు చేయడం జరిగిందన్నారు. మేము 46 నుంచి 60 శాతం వరకు కొన్ని పదవుల్లో మేము ఇవ్వడం జరిగిందన్నారు. ఎంతమంది కి మేము పదవులు ఇచ్చామో రికార్డులు,లెక్కలు తీసి డిబేట్ కు రావాలన్నారు. రాజ్యంగా పరంగా 50 శాతానికి మించకుడదని విషయం తెలియదా అని ప్రశ్నించారు . బీసీ సోదరులను మోసంచేసి,అన్యాయం చేసి ఇప్పుడు పార్టీలో 34 శాతం అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేయమని గత మా ప్రభుత్వ ఎంహాయమాలి ఎవరండీ చెప్పారు అని ప్రశ్నించారు.
మీ లాగా పిరికి పందాలాగ పారిపోలేదు, మీరు ఎప్పుడూ ఎన్నికలు పెట్టిన మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. నీ గులివింజ తత్వం మాకు అంటగట్టడం సరికాదన్నారు.  మేము ముందుగానే రిజర్వేషన్లు కోర్టులో  నిలబడదు అని చెప్పడం జరిగిందన్నారు.  చంద్రబాబు మోసాలను,కుట్రలను ఖండిస్తున్నామన్నారు.అబద్ధాలతో ,
మోసాలతో కాకుండా,
వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీఓ తప్పూ అని అధికారులే చెబుతున్నారు ఎవర్నైనా అడిగినా చెబుతారన్నారు. న్యాయస్థానాలు కూడా మేనేజ్ చేయాలనే ఆలోచన అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఆయన రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.  ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నామన్నారు. గత మా ప్రభుత్వం హయంలో ఎందుకు చంద్రబాబు స్థానిక ఎన్నికలలో పోటీ చేయలేదు అని ప్రశ్నించారు.  ఓట్లు తొలగింపు నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు.  పెరుగుతున్న ధరలు, కారం పొడితో విద్యార్దులు టిఫిన్ తింటున్న అధికార పార్టీ పత్రికలు రాశాయి దీనికి సమాధానం ఏమిటని ప్రశ్నించారు.రెండేళ్లలో 60 శాతం ధరలు పెరిగాయన్నారు. తపస్సు చేయడం వలన వర్షం పడిందని సిగ్గులేని మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారు సిగ్గు ఉండాలన్నారు. రాష్ట్రంలో పాలన ఏంజరుగుతుందా, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి చెప్పాలన్నారు.  ఉద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారన్నారని ప్రశ్నించారు. సిపి ఎస్ రద్దు చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఏమైంది,సున్నా వడ్డీ ఇచ్చారా అని ప్రశ్నించారు.  34 శాతం రిజర్వేషన్లు అంశం చంద్రబాబు మాయ,మోసం దగా తప్ప మరొకటి కాదన్నారు.   రాజ్యంగా సవరణ చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. బీసీ వర్గాలు వారు రాజ్యంగా సవరణ కోసం డిమాండ్ చేయాలని కోరారు. ఇటువంటి అంశాలు మీద రాజకీయాలు తగదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీనిపై ఆలోచించాలని కోరారు. లాలూచీలు ఉన్నవారే పార్టీ మారుతున్నారన్నారు.  భూములు విజయంలో తప్పుడు పద్ధతుల్లో ఉన్నవారే పార్టీలు మారుతున్నారన్నారు.