BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

బీజేపీ తరఫున విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం పాల్గొన్న ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి

Select Suryaa Now
బీజేపీ తరఫున విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం పాల్గొన్న ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి

రాజమహేంద్రవరం, మేజర్ న్యూస్.తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ప్రజాప్రతినిధులను రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఎన్నికల్లో తమ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కూటమిలో భాగంగా బీజేపీకి కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తూ ప్రజలు ఆదరించారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో 17 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని వివరించారు.అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేయగా, ఒక స్థానం ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఎనిమిది చోట్ల విజయం సాధించినట్లు తెలిపారు. బిక్కవోలు ఎంపీపీ పదవిని బీజేపీకి కేటాయించినట్లు వెల్లడించారు. 

మరోచోట వైస్ ఎంపీపీ పదవితో పాటు మిగిలిన మూడు మండలాల్లో కూడా బీజేపీకి వైస్ ఎంపీపీ పదవులు దక్కేలా చర్చలు, ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
అనపర్తి నియోజకవర్గంలో గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీకి సంప్రదాయంగా మద్దతు ఇస్తూ వచ్చిన గ్రామాల్లోనూ ఈసారి కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనపర్తి గ్రామంలోని ఏడు ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, గొల్లల మామిడాడలో ఐదు స్థానాలకు నాలుగు స్థానాలను కూటమి గెలుచుకుందని వివరించారు.అనపర్తి నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు హాల్ట్, కాలువ రోడ్డు పునర్నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపాయని నల్లమిల్లి పేర్కొన్నారు. 

ముఖ్యంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు హాల్ట్ సాధనలో ఎంపీ పురందేశ్వరి సహకారం కీలకమని చెబుతూ ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి జరుగుతోందని అన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.