BREAKING
మూలపాడు వేదికగా ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం.. కఠోర సాధనలో ఇరు జట్లు ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్

బహుజన రాజకీయ దురంధరుడు మాన్యవార్ కాన్షీరామ్ 20వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Select Suryaa Now
బహుజన రాజకీయ దురంధరుడు మాన్యవార్ కాన్షీరామ్ 20వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

రేపల్లె మేజర్ న్యూస్;
ఈ దేశంలో 85% ఓటర్లుగా ఉన్నటువంటి బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించిన రాజకీయ దురంధరుడు మాన్యవార్ కాన్షీరామ్ అని  బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) రేపల్లె అసెంబ్లీ ఇన్చార్జి అండ్రాజు రామరాజు  జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబిపి) రేపల్లె అసెంబ్లీ ఇన్చార్జి దోవా రమేష్ రాంజీ లు కొనియాడారు. శుక్రవారం రేపల్లె పట్టణంలోని అంబేద్కర్ భవనం లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 20వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఓట్లు మావి - సీట్లు మీవా ఇకపై చెల్లదు అని భారతదేశంలో నూతన రాజకీయ వరవడిని సృష్టించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రకటించిన పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అను రాజకీయ పోరాటానికి బాటలు వేసిన మహనీయుడని పేర్కొన్నారు. దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కాన్షిరాం ఆశయ  సాధన కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నాయని, ఒక మహిళ బెహన్ కుమారి మాయావతిని నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టిన ఘనత కాన్షిరాం మహనీయుడికే దక్కుతుందన్నారు. కాన్షిరాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జూలకంటి బుజ్జిబాబు జె బి పి జిల్లా కమిటీ సభ్యులు నేరుసు వెంకటరమనాయుడు, రిటైర్డ్ ఉపాధ్యాయులు మేకతోటి మోక్షానందం, ఆవుల సాంబశివరావు, గాలి సురేష్,  యోహాన్, దారం అంబేద్కర్, బడుగు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు