బాలల ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అంగన్‌వాడీల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం: మంత్రి సంధ్యారాణి.
గన్నవరం, మేజర్ న్యూస్.
బాలల పౌష్టికాహారం, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గన్నవరంలో సోమవారం నిర్వహించిన రాష్ట్రీయ పోషణ మాస్–2026 రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో 55,776 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 23.17 లక్షల మందికి పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీల మౌలిక సదుపాయాల కోసం రూ.99.58 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 21.50 లక్షల మంది చిన్నారులకు ఏఐ ఆధారిత అభివృద్ధి పరీక్షలు నిర్వహించామని, 4,687 మినీ అంగన్‌వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. ప్రీ-స్కూల్ పిల్లల హాజరు 76.98 శాతం నుంచి 88 శాతానికి పెరిగిందన్నారు. అంగన్‌వాడీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సంధ్యారాణిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.
గుర్రం ప్రసాద్, గన్నవరం.